జాతీయంTiruppattur Election Result | ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం.. విదేశాల‌...

Tiruppattur Election Result | ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం.. విదేశాల‌ నుంచి వచ్చి ఓటేసిన వ్య‌క్తే ఈ గెలుపునకు కారణమా?

శివగంగై జిల్లాలో ఒక్క ఓటు తేడాతో టీవీకే అభ్యర్థి విజయం సాధించడం సంచలనంగా మారింది. మస్కట్ నుంచి వచ్చి వేసిన ఓటే ఫలితాన్ని మార్చిందన్న చర్చ వైరల్ అవుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tiruppattur Election Result | తమిళనాడు రాజకీయాల్లో ఈసారి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) సంచలన విజయాలతో ముందుకెళుతుంది. ఈ విజయాల్లో ముఖ్యంగా సామాన్యుల పాత్ర ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో కొద్దిమందిని తప్ప మిగతా వారు పెద్దగా ప్రజలకు పరిచయం లేని వారే.

అయినప్పటికీ, విజయ్‌ (Vijay)కు ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్ కారణంగా వీరంతా అద్భుత విజయాలు సాధించారు.ఇలాంటి విజయాల్లో అత్యంత ఆసక్తికరమైనది శివగంగై జిల్లా (Sivaganga District) తిరుపత్తూర్ నియోజకవర్గంలో నమోదైంది. ఇక్కడ టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందడం సంచలనం సృష్టించింది. ప్రత్యర్థి, డీఎంకే మంత్రి పెరియకరుప్పన్​పై ఆయన ఈ విజయం సాధించారు.

Tiruppattur Election Result | ఆ ఓటే కీల‌కం..

ఈ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు రాగా, పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు వచ్చినట్లు తుది లెక్కలు చెబుతున్నాయి. అంటే కేవలం ఒక్క ఓటే గెలుపు-ఓటమి తేడాను నిర్ణయించింది. ప్ర‌జాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత కీలకమో ఈ ఫలితం స్పష్టంగా నిరూపించింది. ఈ గెలుపునకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, విదేశం నుంచి వచ్చి వేసిన ఓటు. మస్కట్ (ఒమన్) నుంచి వచ్చిన విజయ్ అభిమాని మణికందన్ శివానంతం ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వదేశానికి వచ్చాడు. తాను వేసిన ఓటే నిర్ణయాత్మకమై ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తమ అభిమాన నాయకుడు విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రయాణం చేసినందుకు గర్వంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Tiruppattur Election Result | డీఎంకే శ్రేణులు షాక్‌

ఈ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు కూడా గణనీయమైన ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థికి సుమారు 29,054 ఓట్లు రాగా, నామ్ తమిళ్‌కర్ కట్చి అభ్యర్థికి 15 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ, చివరికి ఫలితాన్ని నిర్ణయించింది మాత్రం ఒక్క ఓటే కావడం విశేషం.టీవీకే అభ్యర్థి (TVK Candidate) గెలుపుతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు, ఒక్క ఓటుతో తమ నాయకుడు ఓడిపోవడంతో డీఎంకే శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. మొత్తానికి, తిరుపత్తూర్ ఫలితం ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువ ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసింది. ఒక ఓటు దేశ రాజకీయ దిశనే మార్చగలదని ఈ సంఘటన చాటి చెబుతోంది.

ఇది కూడా చదవండి..: Tamil Nadu Elections| తమిళనాడులో ముగిసిన ద్రవిడ శకం.. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా!

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

Share post:

Popular

More like this
Related

West Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం...

BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Victory Celebration | వెస్ట్ బెంగాల్, అస్సాం,...

Hyderabad Trap Gang | అమ్మాయిలను ట్రాప్​ చేసిన అన్నదమ్ములు.. సహకరించిన తల్లి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Trap Gang | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో...

Transfers | రాష్ట్రంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక...