Vande Mataram Row | పూర్తి వందేమాతరం గీతం ఆలపించడంపై కాంగ్రెస్​ అభ్యంతరం

శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Mataram Row | శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.

జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సోమవారం వందేమాతరంపూర్తి వెర్షన్‌ను ప్రదర్శించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, గీతం సంక్షిప్త వెర్షన్‌కే కట్టుబడి ఉండటంలో తమ పార్టీకి అండగా నిలవాలని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్‌కు సలహా ఇచ్చారు. దీనిపై నేషనల్​ కాన్ఫరెన్స్​ ధీటుగా స్పందించింది. కూటమిలోని పార్టీలకు కాంగ్రెస్​ షరతులు విధించలేదని స్పష్టం చేసింది.

Vande Mataram Row | అది ప్రజల ఎంపిక

కూటమి భాగస్వామిగా, పాడాలా వద్దా, ఎంత పాడాలి అనే విషయాలను కాంగ్రెస్​ నిర్దేశించలేదని నేషనల్​ కాన్ఫరెన్స్​ పేర్కొంది. వేణుగోపాల్‌కు ట్వీట్ చేసే హక్కు ఉందని, అయితే ఆయన అభిప్రాయాలను ఇతరులపై రుద్దలేరని తెలిపింది. అది ప్రజల ఎంపిక అని స్పష్టం చేఇసంది. నాగ్‌పూర్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆదేశాలకు తలొగ్గవద్దని కోరుతూ, కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా ఇండియా కూటమిలో భాగమని కపిల్​ సిబల్ అన్నారు. వారు కాంగ్రెస్ నిర్ణయాన్ని గౌరవించాలి కానీ నాగ్‌పూర్ నిర్ణయాన్ని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vande Mataram Row | బీజేపీ విమర్శలు

పూర్తి వందేమాతరం ఆలపించడాన్ని వ్యతిరేకించినందుకు కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. పూర్తి వందేమాతరం ఆలపించడానికి కాంగ్రెస్ అభ్యంతరం తెలపడం, అది 21వ శతాబ్దపు కొత్త ముస్లిం లీగ్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. ఇకపై అన్ని పార్టీ కార్యక్రమాలలో జాతీయ గీతంలోని రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని 1937లో తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) గత నెలలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పూర్తి గేయం పాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్​ కాంగ్రెస్​ నిర్ణయాన్ని కాదనడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Vijay Mallya Bank Dues | నా డబ్బులు ఎప్పుడిస్తారు.. బ్యాంకులకు విజయ్​ మాల్యా ప్రశ్న

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *