అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Mallya Bank Dues | నా డబ్బులు ఎప్పుడిస్తారు.. బ్యాంకులకు విజయ్ మాల్యా ప్రశ్న బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా సంచలన ట్వీట్ చేశారు. తనకే బ్యాంకులు డబ్బులు బాకీ ఉన్నాయని, అవి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
విజయ్ మాల్య 2016లో భారత్ (India) విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఆయన యూకేలో నివాసం ఉంటున్నారు. అయితే తనను మోసగాడిగా మీడియాలో ప్రచారం చేయడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈడీ ఛార్జిషీట్ ప్రకారం 2017 జనవరి నాటికి తన అప్పులు రూ.6,203కోట్లు అని మాల్యా తెలిపారు. 2021 జనవరి నాటికి అవి వడ్డీతో కలిపి రూ.10,230 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. అయితే బ్యాంకులు 2021 నాటికి తనకు చెందిన రూ.14,131.60 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పారు. అయినా ఇంకా బ్యాంకులను మోసం చేసిన నేరస్థుడిగా తనను చూపిస్తున్నారని ఆవేన వ్యక్తం చేశారు.
Vijay Mallya Bank Dues | రూ.6,722 కోట్లు రావాలి..
డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం రూ.10,230.58 కోట్లు అప్పులు అయితే.. బ్యాంకులు రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేశాయన్నారు. బ్యాంకులు అదనంగా 3,901.02 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించారు. 11.5శాతం వడ్డీతో కలిపి 2026 జూలై నాటికి వాటి విలువ రూ.6,722 కోట్లకు చేరిందన్నారు. తన బకాయిల కంటే బ్యాంకులు ఎక్కువ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు. తనను ఇంకా ఆర్థిక నేరస్తుడిగా చూపించవద్దని మీడియాను కోరారు. అంతేగాకుండా తనకు రావాల్సిన మిగిలిన సొమ్మును రీఫండ్ చేయాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మీడియా తనను విమర్శించడం, ద్వేషించడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి..: LPG Refill Booking | 25 రోజులకే LPG రీఫిల్ బుకింగ్.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే విధానం