LPG Refill Booking | 25 రోజులకే LPG రీఫిల్ బుకింగ్.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే విధానం

వినియోగదారులకు అవసరమైన సమయంలో సిలిండర్‌ అందుబాటులో ఉండేలా బుకింగ్‌ విధానాన్ని సరళీకరించడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: LPG Refill Booking | వంటగ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎల్‌పీజీ (LPG) రీఫిల్‌ సిలిండర్‌ను 25 రోజుల గ్యాప్‌తోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బుకింగ్‌ గ్యాప్‌ నిబంధనల్లో వ్యత్యాసం ఉండగా.. ఇకపై రెండు ప్రాంతాల్లోనూ ఒకే విధానం అమలు చేయనున్నారు.

LPG Refill Booking | గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే బుకింగ్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 45 రోజుల బుకింగ్‌ గ్యాప్‌ను 25 రోజులకు కుదించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా పట్టణ ప్రాంతాల వినియోగదారుల మాదిరిగానే 25 రోజుల తర్వాత తమ తదుపరి LPG రీఫిల్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

LPG Refill Booking | సరఫరా మెరుగుపడటంతో నిర్ణయం

దేశవ్యాప్తంగా LPG సరఫరా పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులకు అవసరమైన సమయంలో సిలిండర్‌ అందుబాటులో ఉండేలా బుకింగ్‌ విధానాన్ని సరళీకరించడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

LPG Refill Booking | చమురు కంపెనీలకు ఆదేశాలు

కొత్త బుకింగ్‌ గ్యాప్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Kharge Stage Purification | ఖర్గే సభా వేదిక శుద్ధి ఘటనపై కాంగ్రెస్ ఎంపీల నిరసన

ఈ నిర్ణయంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల LPG వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. 45 రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేకుండా 25 రోజుల తర్వాతే రీఫిల్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు లభించనుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *