Jharkhand Student Protest | జార్ఖండ్​లో విద్యార్థులపై లాఠీఛార్జ్​ తప్పు : రాహుల్​ గాంధీ

జార్ఖండ్​లో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్​ను కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఖండించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jharkhand Student Protest | కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్​లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పు అన్నారు.

జార్ఖండ్​ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే అసెంబ్లీకి వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. వాటర్​ కెనాన్లు, టియర్​ గ్యాస్​ ప్రయోగించారు. దీనిపై రాహుల్​ గాంధీ స్పందించారు. శాంతియుత నిరసన అనేది ఒక హక్కు అని నొక్కిచెబుతూ, జార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగాన్ని ఖండించారు.

Jharkhand Student Protest | అధికారంలో ఉండి…

జార్ఖండ్​లో కాంగ్రెస్​ కూటమి అధికారంలో ఉంది. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు మిత్రపక్షంగా కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్​ విద్యార్థులపై లాఠీఛార్జ్​ చేయగా.. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఖండించడం గమనార్హం. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు లభిస్తాయని ఆయన అన్నారు. నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు నిరసనగా నిరుద్యోగులు బారికేడ్లను ఛేదించుకుని జార్ఖండ్ అసెంబ్లీ ప్రాంగణానికి సమీపిస్తుండగా, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.

Jharkhand Student Protest | సంస్కరణలు తీసుకురావాలి

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC)లలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేయడంతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈ సమస్యపై తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JLKM) నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో ఈ యాత్రలో చేరారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ చిత్రపటాన్ని పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు.

 

దీనిని కూడా చదవండి : Fishermen Accident Insurance | మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా.. రూ.5 లక్షల ప్రమాద బీమా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *