Ashok Dham Stampede | ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ఉన్న అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashok Dham Stampede | బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ఉన్న అశోక్ ధామ్ ఆలయం వెలుపల సోమవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. విద్యుత్ స్తంభం కూలిపోవడంతో విద్యుత్ తీగ జనసమూహంపై పడిందన్న వదంతులతో.. ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి.

Ashok Dham Stampede | రూ.4 లక్షల పరిహారం

ఈ ఘటనపై బీహార్​ సీఎం సామ్రాట్​ చౌదరి (Bihar CM Samrat Chaudhary) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన, తక్షణ వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. లఖీసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 6.30 నుండి 6.45 గంటల మధ్య రెండు రైళ్లు రావడంతో భక్తుల రద్దీ అసాధారణంగా పెరిగిందన్నారు.

జనాల ఒత్తిడి కారణంగా ఒక వైపు బారికేడ్ విరిగిపోవడంతో ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు అని తెలిపారు. కేబుల్ వైర్​ కింద పడగా.. విద్యుత్​ వైరు అని ప్రచారం జరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారని చెప్పారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. అశోక్ ధామ్ ఆలయాన్ని శ్రీ ఇంద్రదమనేశ్వర మహాదేవ ఆలయం అని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

ఇది కూడా చదవండి..: Ganga River Tragedy | గంగానదిలో నలుగురు బాలికల గల్లంతు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *