SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: SRSP Water Storage | ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులోకి వచ్చే ఇన్‌ఫ్లో కూడా తగ్గినట్లు అధికారులు తెలిపారు.

SRSP Water Storage | 1,013 క్యూసెక్కుల ఇన్​ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ (Sriramsagar Project) పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,079.60 అడుగుల (43.967 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 59.766 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 15.8 టీఎంసీల మేర తక్కువగా ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి.  ప్రస్తుతం జలాశయంలోకి 1,013 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,013 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

ఇది కూడా చదవండి..: Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్​ అరెస్ట్​..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *