Paddy Lorry Extortion | వడ్ల లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్.. నలుగురు విలేకరులపై కేసు

బాన్సువాడకు చెందిన నలుగురు లారీ డ్రైవర్‌ను రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Lorry Extortion | వడ్ల లోడుతో వెళ్తున్న లారీని కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించినట్లు లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Paddy Lorry Extortion | కారులో వచ్చి అడ్డగింత

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి Kamareddy జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన సకినాల సురేందర్ వడ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన వద్ద ఉన్న వడ్లను లారీలో లోడ్ చేయించి ఆంధ్రప్రదేశ్‌లోని సాయిరాం రైస్ ఇండస్ట్రీస్‌కు పంపిస్తున్నారు.

Shamshabad Car Fire | కారులో మంటలు..అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం

ఈ క్రమంలో సెప్టెంబర్ 26న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మల్లాయిపల్లి గ్రామ సమీపంలో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు లారీని అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Paddy Lorry Extortion | హత్య చేస్తామని బెదిరింపు

బాన్సువాడకు చెందిన ఎం.డి. అబ్దుల్ మోసిన్, గాండ్ల సుధీర్, ఎడ్ల మహేష్ కుమార్, బుడ్డి ఆనంద్‌లు లారీ డ్రైవర్‌ను రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించినట్లు సురేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు ఆధారంగా ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురు కూడా బాన్సువాడ రిపోర్టర్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *