అక్షరటుడే, వెబ్డెస్క్: Shamshabad Car Fire | హైదరాబాద్–బెంగళూరు Bengaluru జాతీయ రహదారిపై శంషాబాద్ సమీపంలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
Shamshabad Car Fire | ఇంజిన్లో పొగలు..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారులో శంషాబాద్ పరిధికి చేరుకోగానే ఇంజిన్ భాగం నుంచి పొగలు వెలువడటాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే వాహనాన్ని రహదారి పక్కకు నిలిపి, అందులో నుంచి బయటకు వచ్చాడు. కొద్దిసేపటికే మంటలు పెద్దఎత్తున చెలరేగి కారు మొత్తాన్ని చుట్టుముట్టాయి.
Shamshabad Car Fire | బూడిదైన కారు..
కారులో మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన ఇతర వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.
Kedarnath Landslide | కేదార్నాథ్లో విరిగిపడిన కొండచరియలు
ప్రాథమికంగా ఇంజిన్ అధికంగా వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం కారణంగా హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.