Vijay CM Tamil Nadu| తమిళనాట ‘విజయ్’ శకం షురూ.. మే 7న ప్రమాణ స్వీకారం!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay CM Tamil Nadu|తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మే 7వ తేదీ, గురువారం నాడు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు

Vijay CM Tamil Nadu|నెహ్రూ స్టేడియంలో భారీ ఏర్పాట్లు..

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భద్రత, ప్రోటోకాల్ మరియు అతిథుల రాకపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

Vijay CM Tamil Nadu|రేపు గవర్నర్‌తో భేటీ..

ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా విజయ్ రేపు ఇన్‌ఛార్జి గవర్నర్‌ను కలవనున్నారు. తన పార్టీకి ఉన్న బలాన్ని వివరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరనున్నారు. 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, మిత్రపక్షాల మద్దతుతో మే 7న కొలువుదీరనుంది.

తమిళనాట దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తూ, ఒక నటుడిగా కాకుండా ప్రజా ప్రతినిధిగా విజయ్ బాధ్యతలు చేపట్టనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: crop procurement | పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : కేటీఆర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *