Women welfare schemes | కాంగ్రెస్​ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత: షబ్బీర్​ అలీ

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Women welfare schemes | కాంగ్రెస్​ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నామని.. అందుకే మహిళలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) తెలిపారు. కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని తన నివాసం వద్ద మంగళవారం మహిళలకు చీరలను అందజేశారు.

Women welfare schemes | పేదల సంక్షేమమే లక్ష్యంగా..

షబ్బీర్​ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, ఆర్డీవో గిరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, తహశీల్దార్ హిమబిందు, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సందీప్, పండ్ల రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: crop procurement | పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : కేటీఆర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *