Shabbir Ali | అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం..: షబ్బీర్ అలీ

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో దుకాణాలు కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద అగ్నిప్రమాదం సంభవించి షాపులు దగ్ధమై జీవనోపాధి కోల్పోయిన బాధితులను మంగళవారం పరామర్శించారు.

Shabbir Ali | ఆర్థిక సహాయం అందజేత

అగ్ని ప్రమాద వివరాలను షబ్బీర్​ అలీ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం వల్ల 18 షాపులు దగ్ధం కావడం బాధాకరమన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. రూ.35 లక్షల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేయడం జరిగిందని వివరించారు. బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయమై చర్చిస్తామని తెలిపారు. అనంతరం 21 షాపుల బాధితులకు దాదాపు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో గిరి, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి, కమిషనర్ పర్వతాలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Self Enumeration Record | స్వీయ గణనలో రికార్డు.. సోమ్లా నాయక్ తండా ఘనత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *