BRS Councillor Resignation | బీఆర్​ఎస్​కు​ కౌన్సిలర్ రాజీనామా.. కాంగ్రెస్​లో చేరిక

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BRS Councillor Resignation | ఎల్లారెడ్డి మున్సిపల్ 11వ వార్డు (లింగారెడ్డిపేట్) బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ రామగాళ్ల లక్ష్మి శివానంద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

BRS Councillor Resignation | అనేక అభివృద్ధి కార్యక్రమాలు

పదేళ్లుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో 11వ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని లక్ష్మి శివానంద్​ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. శ్మశానవాటికకు బోరు వేయడం, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం, హరిజనవాడలో కొత్త స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రభావితమై కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్​ శ్రీకాంత్, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండలాధ్యక్షుడు కుర్మ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *