Double Bedroom Houses | ఇళ్ల పట్టాల పంపిణీలో జాప్యంపై లబ్ధిదారుల నిరసన

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Double Bedroom Houses | బీఆర్​ఎస్​ హయాంలో తమకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు నిర్మించి ఇచ్చినప్పటికీ పట్టాలు(double bedroom pattas) ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఈ మేరకు మంగళవారం బీర్కూర్ (Birkur) మండలంలోని తహశీల్దార్​ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

Double Bedroom Houses | నిరాహార దీక్ష చేస్తాం

లబ్ధిదారులు మాట్లాడుతూ.. పట్టా పంపిణీ రోజు రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా కొంతమందికి మాత్రమే సర్టిఫికెట్లు అందజేశారన్నారు. మిగిలిన వారికి ఇప్పటికీ పట్టా (Telangana housing scheme) సర్టిఫికెట్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆరోపించారు. కొత్త ప్రభుత్వం (Congress Government) ఏర్పడి సుమారు 30 నెలలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో ముగ్గురు ఆర్డీవోలు, నలుగురు తహశీల్దార్లు మారినప్పటికీ పట్టాల పంపిణీ మాత్రం ముందుకు సాగలేదని నిరసన వ్యక్తం చేశారు. పట్టా సర్టిఫికెట్లు సిద్ధమై ఏళ్లు గడుస్తున్నప్పటికీ వాటిని పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ లబ్ధిదారులంతా తహశీల్దార్ సవాయి సింగ్​కు వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లోపు పెండింగ్‌లో ఉన్న పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరాహార దీక్ష చేపట్టేందుకు వెనుకాడబోమని లబ్ధిదారులు హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu Politics | టీవీకే అధినేత విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్ వాడి అధికారంలోకి వచ్చారు: స్టాలిన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *