నిజామాబాద్Self Enumeration Record | స్వీయ గణనలో రికార్డు.. సోమ్లా నాయక్ తండా ఘనత

Self Enumeration Record | స్వీయ గణనలో రికార్డు.. సోమ్లా నాయక్ తండా ఘనత

బాన్సువాడ మండలంలోని సోమ్లా నాయక్ తండా స్వీయ గణనలో విశేష విజయాన్ని సాధించింది.

అక్షరటుడే, బాన్సువాడ : Self Enumeration Record | బాన్సువాడ మండలం (Banswada Mandal)లోని సోమ్లా నాయక్ తండా స్వీయ గణనలో విశేష విజయాన్ని సాధించింది. రాష్ట్రంలోనే వందశాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండో గ్రామంగా తండా రికార్డు సృష్టించింది.

Self Enumeration Record | వందశాతం స్వీయ గణన

కలెక్టర్ సూచనల మేరకు మండల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామ ప్రజలకు స్వీయ గణనపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. దీనివల్ల గ్రామస్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి స్వీయ గణన ప్రక్రియను పూర్తిగా విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ రాజ్ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. మండల, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు. మంగళవారం నాటికి గ్రామంలో వంద శాతం స్వీయ గణన పూర్తయిందని ఆయన వెల్లడించారు. గ్రామ ప్రజల చైతన్యం, అధికారుల కృషి కలిసొచ్చి సాధించిన ఈ విజయాన్ని స్థానికంగా అభినందిస్తున్నారు. ఇతర గ్రామాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Census Self Enumeration | నాగిరెడ్డిపేట మండలంలో జనాభా లెక్కల స్వీయ గణనకు శ్రీకారం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bhu Bharati server down | భూ భారతి సర్వర్​ డౌన్​.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu Bharati server down | రాష్ట్రంలో...

Beedi Thekedars | డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలి.. బీడీ టేకేదార్ల డిమాండ్

అక్షరటుడే, కామారెడ్డి: Beedi Thekedars | చార్ బై కంపెనీ నుంచి...

Shabbir Ali | అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం..: షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో దుకాణాలు కోల్పోయిన...

Hyderabad Lantern Festival హైదరాబాద్‌లో ‘థాయ్’ మాయాజాలం..మే 9న భారీ లాంతర్ల పండుగ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hyderabad Lantern Festival థాయ్‌లాండ్ దేశపు ప్రసిద్ధ సంప్రదాయ వేడుకను...