అంతర్జాతీయంUS plane missing | అమెరికా విమానం మిస్సింగ్​

US plane missing | అమెరికా విమానం మిస్సింగ్​

అమెరికాకు చెందిన భారీ విమానం మిస్​ అయింది. బోయింగ్‌ KC-135 స్ట్రాటో విమానం పర్షియన్‌ గల్ఫ్‌ మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US plane missing | అమెరికాకు చెందిన భారీ విమానం మిస్​ అయింది. బోయింగ్‌ KC-135 స్ట్రాటో విమానం పర్షియన్‌ గల్ఫ్‌ మీదుగా ప్రయాణిస్తుండగా రాడార్​ నుంచి అదృశ్యం అయింది. అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ ‘7700’ అనే ప్రమాద సంకేతం జారీ చేసినట్టు ఫ్లైట్ రాడార్‌ డేటా తెలిపింది.

సాధారణంగా సైనిక విమానాలకు గగనతల ఇంధన సరఫరా కేంద్రంగా ఉపయోగించే KC-135 స్ట్రాటోట్యాంకర్, ఇరాన్ (Iran) సమీపంలోని పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు మిస్​ అయింది. ఈ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తర్వాత, ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా దాని సిగ్నల్ కోల్పోయింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా సైనిక కార్యకలాపాలకు మద్దతుగా ఈ ట్యాంకర్ చురుకుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

US plane missing | గాల్లో చక్కర్లు..

విమానం కిందకు దిగడం ప్రారంభించడానికి ముందు కొంతసేపు గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. పైలెట్​ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు ఏదైనా శత్రు కార్యకలాపాలతో సంబంధం ఉందని అధికారికంగా ఎటువంటి నిర్ధారణ కాలేదు. KC-135 కూలిపోవడం, నష్టం లేదా అత్యవసర పరిస్థితి జరిగినట్లు నిర్ధారణగా సెంట్రల్ కమాండ్ (CENTCOM) లేదా పెంటగాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య తీవ్రమైన GPS/ఎలక్ట్రానిక్ జామింగ్ కారణంగా అక్కడ రాడార్ డ్రాప్‌లు, 7700 స్క్వాక్‌లు సర్వసాధారణం అని అధికారులు పేర్కొన్నారు. అంతమాత్రాన అది కూలిపోయిందని అర్థం కాదన్నారు.

 

దీనిని కూడా చదవండి : Urja Suraksha | ప్రపంచమంతా ఇంధన సంక్షోభం.. ‘ఆపరేషన్ ఊర్జ సురక్ష’తో భారత్ సేఫ్!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

High Court holidays | మే 7 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court holidays | తెలంగాణ హైకోర్టు...

TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ ముందుంటుంది

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి...

RB Choudhary | ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RB Choudhary | ప్రముఖ సినీ నిర్మాత...

Vijay CM Tamil Nadu| తమిళనాట ‘విజయ్’ శకం షురూ.. మే 7న ప్రమాణ స్వీకారం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay CM Tamil Nadu|తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి...