అక్షరటుడే, వెబ్డెస్క్: Kharge Stage Purification | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా వేదికను శుద్ధి చేసిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు.
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. సభా వేదిక శుద్ధి ఘటనపై బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Kharge Stage Purification | ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు
ఎంపీల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో కొంతసేపు కొనసాగిన కాంగ్రెస్ ఎంపీల నిరసనకు తెరపడింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజా జీవితంలో ఇలాంటి చర్యలకు తావు ఉండకూడదని పేర్కొన్నారు.
Kharge Stage Purification | అసలేం జరిగిందంటే..
ఆగస్టు 8, 2026న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆగస్టు 10న, అంటే సభ జరిగిన రెండు రోజుల తర్వాత, ఆ మైదానంలో ఒక హిందుత్వ సంస్థకు చెందిన వారు హవన్ నిర్వహించి, గంగాజలం చల్లి ‘శుద్ధీకరణ’ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఈ ‘శుద్ధీకరణ’ చేశారనే ఆరోపణలను కాంగ్రెస్ చేసింది. దీనిని కుల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్యగా కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఈ వ్యవహారంపై ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. BJP నేత జేపీ నడ్డా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తర్వాత ఖర్గే పేర్కొన్నారు.
అయితే FIR నమోదులో జాప్యం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. సెప్టెంబరు 5న బెంగళూరు పోలీసులు ఈ ఘటనపై Zero FIR నమోదు చేశారు. అందులో ఉత్తరాఖండ్ BJP చీఫ్ మహేంద్ర భట్ తదితరుల పేర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తాజాగా మల్లు రవి సహా కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, ఈ ఘటనపై FIR నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Nandu’s World Scam Arrest | లగ్జరీ ముసుగులో మోసం.. నందూస్ వరల్డ్ నందన అరెస్టు.. వెలుగులోకి సోషల్ మీడియా క్రేజ్ వెనుక నల్ల నిజాలు!