జాతీయంPalk Strait Swim Record | పాక్​ జలసంధిని ఈదిన బుడతడు.. ఏడేళ్ల బాలుడి రికార్డు

Palk Strait Swim Record | పాక్​ జలసంధిని ఈదిన బుడతడు.. ఏడేళ్ల బాలుడి రికార్డు

జార్ఖండ్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు రికార్డు సృష్టించాడు. కేవలం 9 గంటల 50 నిమిషాల్లోనే పాక్ జలసంధిని ఈదాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Palk Strait Swim Record | జార్ఖండ్‌ (Jharkhand)కు చెందిన ఏడేళ్ల బాలుడు ఇషాంక్ రికార్డు సృష్టించాడు. కేవలం 9 గంటల 50 నిమిషాల్లోనే పాక్ జలసంధిని (Palk Strait) 29 కిలోమీటర్ల మేర ఈది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మార్గాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా అతను నిలిచాడు.

ఇషాంక్​ శుక్రవారం పాక్​ జలసంధి (Palk Strait)ని ఈదాడు. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ఇషాంక్ సింగ్, భారత్-శ్రీలంకల మధ్య ఉన్న ఈ జలసంధిని 9 గంటల 50 నిమిషాల్లో విజయవంతంగా దాటాడు. బలమైన ప్రవాహాలు, సముద్రపు అలలు, అనూహ్యమైన వాతావరణం కారణంగా ఈ జలమార్గం సవాలుతో కూడుకున్నది. అయినప్పటికీ, సింగ్ ఈ అడ్డంకులను అధిగమించి, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి ధనుష్కోడిలోని అరిచల్‌మునై వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశాడు.

Palk Strait Swim Record | ఘన స్వాగతం

ఇషాంక్​ ఉదయం 4 గంటలకు తన ఈతను ప్రారంభించి మధ్యాహ్నం 1:50 గంటలకు పూర్తి చేశాడు. అతను రామేశ్వరం ఇసుకపై అడుగుపెట్టగానే అధికారులు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. బాలుడు సాధించిన ఈ ఘనతను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Jharkhand CM Hemant Soren) ప్రశంసించారు. ఇషాంక్ విజయం క్రమశిక్షణకు, తన లక్ష్యం పట్ల అచంచలమైన అంకితభావానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. అతను జార్ఖండ్‌కే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం అయ్యాడని కొనియాడారు. గతంలో ఈ రికార్డు తమిళనాడుకు చెందిన జయ జశ్వంత్ పేరిట ఉండేది. అతను 2019లో తన 10వ ఏట 10 గంటల 30 నిమిషాల్లో ఈతను పూర్తి చేశాడు.

ఇది కూడా చదవండి..: Dosa Global Ranking | ప్రపంచ వేదికపై స‌త్తా చాటిన మ‌న దోశ‌.. టాప్-50 పాన్‌కేక్స్ జాబితాలో మూడు భారతీయ రుచులు

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Screen Time Autism | పిల్లలకు ఫోన్​ ఇస్తున్నారా.. పొంచి ఉన్న ఆటిజం ముప్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Screen Time Autism | ప్రస్తుతం పిల్లలు...

CM Revanth Reddy Meeting | నేడు ప్రభుత్వ విప్​లతో సీఎం సమావేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy Meeting | సీఎం రేవంత్...

AP WhatsApp Services | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో వైద్య సేవలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP WhatsApp Services | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం...

Auto Sales in India | ఆటో.. అదరహో.. రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Auto Sales in India | కార్ల...