Amit Shah Mamata Attack | బెంగాల్‌లో మహిళలకు భద్రత కరవు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Naresh Chandan
Amit Shah Mamata Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amit Shah Mamata Attack | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి Mamata Banerjeeపై కేంద్ర హోం మంత్రి Amit Shah తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల భద్రత విషయంలో టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

Amit Shah

Amit Shah Mamata Attack | నిర్భయంగా సంచరించే వాతావరణం

జమాల్‌పూర్‌లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. “మమత పాలనలో తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు భద్రత లేదు. రాష్ట్రంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 7 తర్వాత మహిళలు బయటకు రాకూడదని చెప్పే పరిస్థితి ఏర్పడింది” అని ఆరోపించారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి మారుతుందని, రాత్రి వేళల్లో కూడా మహిళలు నిర్భయంగా సంచరించే వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల ఫలితాలపై విశ్వాసం వ్యక్తం చేసిన అమిత్ షా.. మొదటి దశలోనే Bharatiya Janata Party 110 స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “మే 4 తర్వాత మమత ప్రభావం ముగుస్తుంది” అని వ్యాఖ్యానించారు.

Amit Shah Mamata Attack | నిధులు మాయం..

ఇక టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ, కేంద్రం పంపిన నిధులు ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. పేదల ఇళ్లు, తాగునీరు, విద్య కోసం ఇచ్చిన డబ్బు ‘కట్ మనీ’ రూపంలో మళ్లించబడుతోందని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పైసాను తిరిగి రాబట్టుతామని స్పష్టం చేశారు. అలాగే, పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కూడా వ్యాఖ్యానిస్తూ, మతువా వర్గానికి చెందిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చ మొదలైంది.

Vaibhav Suryavanshi Century | SRHపై విరుచుకుపడ్డ RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 36 బంతుల్లో సెంచరీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *