Kavitha vs Jeevan Reddy | “బీఆర్ఎస్‌కు శాపనార్థాలు పెట్టడం మానుకో తల్లి”.. కవిత కొత్త పార్టీపై జీవన్ రెడ్డి ఫైర్!

Naresh Chandan
Kavitha vs Jeevan Reddy

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kavitha vs Jeevan Reddy | కొత్త పార్టీ ఆవిర్భావ వేడుకలో బీఆర్​ఎస్​ పార్టీతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​పై కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, కవిత వైఖరిని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

trs

Kavitha vs Jeevan Reddy | “బీ టీంగా కవిత పార్టీ”

కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించేలా ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. “కవిత కొత్త పార్టీ రేవంత్ రెడ్డికి బీ టీంగా తయారవుతోంది. ఆమె చర్యలు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచి, కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా ఉన్నాయి” అని ఆయన విమర్శించారు.

Kavitha vs Jeevan Reddy | కేసీఆర్‌పై వ్యాఖ్యలకు హెచ్చరిక

కేసీఆర్‌ను ఉద్దేశించి కవిత వాడిన పదజాలంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మరమనిషి” వ్యాఖ్య వెనక్కి తీసుకోవాలి: “తండ్రి అని చూడకుండా కేసీఆర్‌ను ‘మరమనిషి’ అనడం అత్యంత దురదృష్టకరం. ఆ మాటను ఆమె వెంటనే వెనక్కి తీసుకోవాలి..” అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి శాపనార్థాలు పెట్టడం మానుకోవాలని, పార్టీ క్యాడర్ మనోభావాలను దెబ్బతీయొద్దని జీవన్​రెడ్డి హితవు పలికారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి జీవన్ రెడ్డి సొంత పార్టీ అధినేత కూతురిపైనే నేరుగా విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. “బీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురికావద్దు.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా సహించేది లేదు..” అని జీవన్ రెడ్డి అన్నారు.

Vaibhav Suryavanshi Century | SRHపై విరుచుకుపడ్డ RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 36 బంతుల్లో సెంచరీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *