అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 09 Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం, గల్ఫ్ Gulf ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తున్నాయి.
దీంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ మరో సెషన్‌లోనూ బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sep 09 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.32 శాతం, ఎస్ అండ్ పీ 0.58 శాతం పడిపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.07 శాతం నష్టంతో ఉంది.
Sep 09 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.14 శాతం లాభంతో, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.10 నష్టంతో, జర్మనీకి చెందిన డీఏఎక్స్ ఫ్లాట్ గా ముగిశాయి.
Sep 09 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.71 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.86 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.43 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.20 శాతం లాభంతో, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.77 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.24 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.20 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
LPG Refill Booking | 25 రోజులకే LPG రీఫిల్ బుకింగ్.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే విధానం
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 123 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు వరుసగా 21 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 14,678 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.69 నుంచి 0.83 కి పెరిగింది.
- విక్స్ 11.16 వద్ద ఫ్లాట్‌గా ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు బలహీనపడి 94.82 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 99.34 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.79 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.80 వద్ద ఉన్నాయి.