Jhansi Bride Death | హోటల్ గది తలుపు తీసిన ఐదు సెకన్లకే వధువు మృతి.. అసలు లోపల ఏం జరిగింది?

హోటల్ గదిలోకి వెళ్లిన కొన్ని సెకన్లలోనే ఓ నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగుచూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jhansi Bride Death | హోటల్ గదిలోకి వెళ్లిన కొన్ని సెకన్లలోనే ఓ నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Jhansi Bride Death | హోటల్ వద్ద అసలేం జరిగింది?

సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ఝాన్సీకి చెందిన ముస్కాన్ అనే నవవధువు తన భర్త, మరొక వ్యక్తితో కలిసి ఓ హోటల్ గది వద్దకు వచ్చింది. అయితే గది తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టిన ఐదు సెకన్లలోనే ఆమె ఒక్కసారిగా తలుపు వద్దే కిందపడిపోయింది. వెంటనే స్పందించిన భర్త ఆమెను లోపలికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూసింది.

Jhansi Bride Death | అల్లుడిపై ఆరోపణలు..

తమ కుమార్తె మరణం వెనుక భర్త హస్తం ఉందని ముస్కాన్ తండ్రి రామ్‌జీ లాల్ పోలీసులను ఆశ్రయించారు. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న నీలేశ్‌తో నాలుగు నెలల క్రితమే తమ కుమార్తెకు వివాహమైందని ఆయన తెలిపారు. అయితే నీలేశ్‌కు అప్పటికే వేరే మహిళతో పెళ్లయిన విషయం ఆ తర్వాత బయటపడిందని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ముస్కాన్ తమ ఇంటికి రాగా, బంధువుల వద్దకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడని ఆరోపించారు.

Jhansi Bride Death | అనుమానిస్తున్న పోలీసులు..

ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన కుమార్తెను హోటల్‌కు తీసుకువెళ్లి హత్య చేశారని, ఆమె మృతదేహం తలపై తీవ్ర గాయాలు ఉన్నాయని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *