అక్షరటుడే, వెబ్‌డెస్క్: Six IPOs | దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టవడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐపీవో (IPO)లకు భారీ డిమాండ్ ఉండడంతో దానిని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. సెప్టెంబర్ 9 (బుధవారం) ఆరు మెయిన్‌బోర్డ్ కంపెనీల పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైంది. ఈ క్రమంలో 30 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. ఇలా ఒకే రోజు మెయిన్బోర్డ్నుంచి ఆరు ఐపీవోలు రావడం 1996 అక్టోబర్ 14 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Six IPOs | ఆరు మెయిన్‌బోర్డ్ ఐపీవోలు..
రెంటోమోజో అనే కంపెనీ మార్కెట్ నుంచి రూ. 1,255.57 కోట్లు సమీకరించేందుకోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 732.97 కోట్లు సమీకరించబోతోంది.
మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ రూ. 805 కోట్లు, ఎల్సీసీ ప్రాజెక్ట్స్ రూ. 427.14 కోట్లు, స్టెమ్ హౌస్ రూ. 414 కోట్లు, కరంతారా ఇంజినీరింగ్ కంపెనీ రూ. 875 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చాయి.
Six IPOs | మరో 3 ఎస్ఎంఈలు..
సెప్టెంబర్ 9న మరో 3 ఎస్ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన ఐపీవోలూ ప్రారంభమయ్యాయి. ఆంటెక్ ఈస్టర్స్ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 17.88 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. వినోద్ టెక్స్‌వరల్డ్ రూ. 42.83 కోట్లు, ఇన్ఫ్రాక్స్ రెన్యువబుల్ కంపెనీ రూ. 40.88 కోట్లు సమీకరించనున్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 09 Gold Prices | బంగారం ధరలకు బ్రేక్.. చమురు సెగతో మళ్లీ పెరగనున్నాయా?