Realme 16X | రియల్మీ నుంచి మరో ఫోన్ విడుదల

రియల్మీ కంపెనీ మరో మోడల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. రియల్మీ 16 ఎక్స్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్ విక్రయాలు ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme 16X | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన రియల్మీ (Realme).. తన 16 సిరీస్‌లో మరో మోడల్‌ను యాడ్ చేసింది. ఇప్పటికే రియల్మీ 16, 16టీ, 16ప్రో, 16 ప్రో ప్లస్ మోడళ్లు మార్కెట్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం (ఆగస్టు 12న ) 16 ఎక్స్ మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. మొదటి సేల్ ఆగస్టు 13న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఇది రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.84 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 1600 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

Realme 16X | సాఫ్ట్‌వేర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Realme 16X | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme 16X | బ్యాటరీ సామర్థ్యం..

7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్ : ఎండ్యూరెన్సు బ్రౌన్, గ్లోరీ వైట్ కలర్స్‌లో మÖడు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999.
6 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999.

లాంచింగ్ ఆఫర్ : లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 2 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Smart Bazaar Sale | స్మార్ట్ బజార్ లో ‘ఫుల్ పైసా వసూల్ ’.. ఆగస్టు 12-16 వరకు ప్రత్యేక సేల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *