అక్షరటుడే, వెబ్‌డెస్క్: Smart Bazaar Sale | రిలయన్స్ (Reliance) రిటైల్ కు సంబంధించిన స్మార్ట్ బజార్ లో ‘ఫుల్ పైసా వసూల్ సేల’ ప్రారంభించారు. ఇది ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్టు 12న ప్రారంభమైన సేల్ 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణ షాపింగ్ అవసరాలపై మరింత ఆదా చేయడంలో సహాయపడడం, గృహ మరియు వ్యక్తిగత సంరక్షణ, ప్రాసెస్ చేసిన ఆహారం, స్టేపుల్స్, ఫ్యాషన్ తదితర కేటగిరీలలో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలిపింది.
Smart Bazaar Sale | ఆఫర్లు..
చాలా వస్తువులపై బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రధానంగా బిస్కెట్లు, చాక్లెట్లపై ఈ ఆఫర్లున్నాయి. 5 కిలోల బాస్మతి బియ్యం, 2.73 కిలోల నూనెను రూ. 799 కు విక్రయిస్తోంది. డిటర్జెంట్ ప్యాక్‌లపై 33 శాతం వరకు తగ్గింపు ధరను ప్రకటించింది. టాప్ బ్రాండెడ్ షాంపూలపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ీVAం, పర్సనల్ కేర్, ప్రాసెస్డ్ ఫుడ్, నిత్యావసరాలు, డెయిరీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ తదితర కేటగిరీలలోనూ ఆఫర్లున్నాయి.
ఇది కూడా చదవండి: Behari Lal Engineering IPO | చిన్న ఐపీవో.. పెద్ద లాభాలు అందించేనా?