Sep 17 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 17 Market Analysis | ఇరాన్‌పై అమెరికా America యుద్ధం War కారణంగా ముడిచమురు(Crude oil) ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం(Inflation) అధిక స్ఠాయిలలో కొనసాగుతోంది.

దీనిని ఎదుర్కోవడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2023 తర్వాత తొలిసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గత సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.

Sep 17 Market Analysis | భారత మార్కెట్‌పై ప్రభావం..

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లు పెరగడం వల్ల డాలర్ బలపడుతుందని, ఇది భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులను తగ్గించుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్వల్ప కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి.

Sep 17 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.01 శాతం, ఎస్ అండ్ పీ 0.45 శాతం పడిపోయాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.65 శాతం లాభంతో ఉంది.

Sep 17 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.62 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.53 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.28 లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.60 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.19 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.05 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.05 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.32 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.49 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.24 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: Sep 17 Horoscope | సృజనాత్మక రంగాల వారికి అద్భుత యోగం.. ఈ రాశుల వారిని వెతుక్కుంటూ రానున్న కీర్తి ప్రతిష్టలు

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఆరో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,032 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
  • డీఐఐలు వరుసగా 26 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,908 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 95.95 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.32 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5 వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108.44 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.83 నుంచి 0.96 కు పెరిగింది.
  • విక్స్ 1.97 శాతం తగ్గి 13.16 వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *