అక్షరటుడే, డిచ్పల్లి: DCM Truck Accident | ముందు వెళ్తున్న కారును తప్పించే క్రమంలో డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రయాన్‌పల్లి (Chandrayaanpalli) శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
DCM Truck Accident | హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న..
స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్(Hyderabad) నుంచి నాగ్‌పూర్ వైపు పార్సిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం లారీకి ముందున్న కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో డీసీఎం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
DCM Truck Accident | గంటకు పైగా స్తంభించిన ట్రాఫిక్
డీసీఎం లారీ రోడ్డుపై బోల్తా పడటంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బోల్తాపడిన డీసీఎంను తొలగించే చర్యలు చేపట్టి, తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో సహాయక చర్యల సందర్భంగా అటవీ అధికారిపై చిరుత దాడికి పాల్పడింది.