Pralay Missile Test | ప్రళయ్​ క్షిపణి పరీక్ష విజయవంతం..

డీఆర్​డీవో ప్రళయ్​ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pralay Missile Test | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. ఈ మేరకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చేపట్టిన ప్రళయ్​ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది.

ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ‘ప్రళయ్’ (Pralay) అనే క్వాసీ-బాలిస్టిక్ క్షిపణిని డీఆర్​డీవో గురువారం ఉదయం 11:10 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ ఎక్స్​ వేదికగా వివరాలు వెల్లడించారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా మోహరించిన వివిధ పరికరాల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, ఈ పరీక్షకు నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరాయని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

Pralay Missile Test | హైదరాబాద్​లో తయారీ

ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని ఇమారత్ పరిశోధనా కేంద్రం, ఇతర డీఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి స్వదేశీంగా అభివృద్ధి చేసింది. అభివృద్ధి-ఉత్పత్తి భాగస్వాములలో ఒకటైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ వ్యవస్థను తయారు చేసింది. క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. డీఆర్డీవో ఉన్నతాధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, రక్షణ దళాల సభ్యుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించారు.

దీనిని కూడా చదవండి : ACB Trap | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన యువజన క్రీడల అధికారి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *