అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనికి పైసలు అడుగుతున్నారు. లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏసీబీకి పట్టుబడుతున్నా.. కఠిన చర్యలు లేకపోవడంతో అవినీతి అధికారులు భయపడటం లేదు. తాజాగా ఓ మహబూబ్నగర్ యువజన, క్రీడల అధికారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
మహబూబ్నగర్ (Mahabub Nagar) జిల్లా యువజన, క్రీడల అధికారి (DY&SO) జక్కు రాజశేఖర్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. పట్టణంలోని ఎస్ఏటీజీ వాలీబాల్ హాస్టల్లో బస చేస్తున్న క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసిన కాంట్రాక్టర్కు ఆగస్టు 2026 నెలకు పెండింగ్లో ఉన్న క్యాటరింగ్ బిల్లులను ప్రాసెస్ చేసి ఆమోదించడం, క్యాటరింగ్ బిల్లు రూ.3,10,000 చెక్కు విడుదల చేయడం కోసం ఏకంగా రూ.లక్ష లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ACB Trap | ఇద్దరి అరెస్ట్
డీవైఎస్వో రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో పని చేసే టైపిస్ట్ గోరే ఉమేష్ ద్వారా గురువారం రూ.లక్ష లంచం తీసుకున్నాడు. అనంతరం దానిని అధికారికి అప్పగించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా