Wife Suicide Case | భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష

భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Wife Suicide Case | భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవీఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు చెప్పారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్​పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన బాలస్వామి, సబ్బని ఉమా మహేశ్వరి 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. డబ్బుల కోసం బాలస్వామి భార్యను నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె తల్లి నిర్మల అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేది.

Wife Suicide Case | ప్లాట్ అమ్మేయాలని..

ధర్మారం గ్రామంలో నిర్మలకు ఓపెన్ ప్లాట్ ఉంది. అది అమ్మివేసి సగం డబ్బులు తనకు ఇచ్చే విధంగా తల్లిదండ్రులను ఒత్తిడి చేయాలని బాలస్వామి తన భార్య ఉమాను వేధించాడు. దీంతో అతడి బాధ భరించలేక ఆమె 2024 సెప్టెంబర్ 20న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. నేర అభియోగాలు రుజువు కావడంతో సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ.. భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు నిందితుడికి మూడేళ్ల కఠిన జైలుశిక్షతో పాటు రూ.వేయి జరిమానా విధించారు. ఆతహత్యకు ప్రేరేపించినందుకుగాను మరో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.వేయి జరిమానా వేశారు. జరిమానాలు చెల్లించకపోతే అదనంగా మూడు నెలల చొప్పున జైలుశిక్ష అనుభవించాలని సెషన్స్ జడ్జి తీర్పులో పేర్కొన్నారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని సీపీ సాయి చైతన్య అభినందించారు.

దీనిని కూడా చదవండి : Abandoned Newborn Baby | ముళ్లపొదల్లో పసికందు.. మానవత్వం చాటిన గ్రామస్తులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *