Abandoned Newborn Baby | ముళ్లపొదల్లో పసికందు.. మానవత్వం చాటిన గ్రామస్తులు

పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామ శివారులో గురువారం ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన బిడ్డను గ్రామస్తులు గుర్తించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Abandoned Newborn Baby | ఇంకా కళ్లు కూడా సరిగా తెరవలేదు. ఈ లోకంలోకి వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు. అమ్మ గుండెలపై పడుకోవాల్సిన ఆ పసిప్రాణం, అమ్మ పాలకోసం ఏడవాల్సిన ఆ చిన్నారి ముళ్లపొదల్లో(Newborn Baby) అనాథగా పడి ఉంది. ఆ ముళ్లు ఆ పసి శరీరాన్ని గుచ్చుతుంటే.. చలికి వణుకుతూ, ఆకలితో అలమటిస్తూ ఆ బిడ్డ ఏడుపు ఆ గ్రామాన్నే కదిలించింది.

Abandoned Newborn Baby | ఎల్పుగొండలో..

పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామ శివారులో గురువారం ఇలాంటి గుండెను కలచివేసే దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన పసికందును ఎవరో కనికరం లేకుండా చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. ఆ బిడ్డను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. కన్నవాళ్లు ఎలా వదిలి వెళ్లారో అని గ్రామస్తులు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆ పసికందు ఏడుపు విన్న వెంటనే గ్రామస్తులు మానవత్వం చాటారు. అది ఏదో పక్షి అరుపో, జంతువు శబ్దమో అని పట్టించుకోకుండా వెళ్లిపోలేదు. ఏడుపు వస్తున్న వైపు పరుగు తీశారు. ముళ్లపొదల్లో ఉన్న బిడ్డను చూడగానే వారి గుండె తరుక్కుపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఆ పసిప్రాణం ఏమయ్యేదో అని భయపడ్డారు. ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా, ప్రేమగా ఎత్తుకున్నారు. తమ చీర కొంగుతో, తమ దుప్పటితో ఆ చిన్నారిని వెచ్చగా చుట్టారు. వెంటనే దోమకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Abandoned Newborn Baby | కామారెడ్డి జీజీహెచ్​కు

సమాచారం అందిన వెంటనే పరుగున వచ్చిన దోమకొండ పోలీసులు(Domakonda Police) ఆ పసికందును సురక్షితంగా రక్షించి దోమకొండ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి జీజీహెచ్​కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత శిశువును ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దోమకొండ పోలీసులు శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *