అక్షరటుడే, ఎల్లారెడ్డి: Voter Enumeration Drive | అర్హులందరికీ ఓటుహక్కు తప్పిపోకుండా జాగ్రత్తలు పాటించాలని బీజేపీ(Kamareddy bjp) జిల్లా అధ్యక్షడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో 17బూత్ల బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు.
Voter Enumeration Drive | డబుల్ ఓట్లు తొలగిపోయేలా చూడాలి..
ఈ సందర్భంగా నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. ఓటర్లిస్ట్లో డబుల్ ఓట్లు తొలగిపోయేలా చూడాలన్నారు. ఇంకా ఎవరికైనా ఎన్యూమనేషన్ ఫారం అందకపోతే దగ్గరుంచి వారికి అందేలా చూడాలని పేర్కొన్నారు. ఎవరైనా ఓటర్లు ఇతర చోట్ల ఉన్నట్లయితే వారు ఆన్లైన్లో అయినా ఎన్యూమరేషన్ ఫారం నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే బీఎల్వోలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అధ్యక్షుడు నర్సింలు, సీనియర్ నాయకులు బలరాజ్, యాదగిరి, మల్లయ్య, కాశీనాథ్, యువ నాయకులు గజానన్, రమేష్, శివ, రవి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘‘నీకు ఎవరైనా నచ్చలేదా వదిలేయ్. వాళ్లను హేట్ చేయడం, ట్రోల్ లాంటివి చేయొద్దు. ఆ సమయాన్ని మీ కోసం ఉపయోగించుకోండి’’