Minister Seethakka | ఉపాధిహామీ కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: మంత్రి సీతక్క

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Seethakka | రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సీతక్క (Seehakka) పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ (Nizamabad Rural Constituency) పరిధిలోని మల్కాపూర్ పంచాయతీ కొత్తపేట తండాలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు. స్వయంగా వారితో కలిసి పనిచేశారు.

Minister Seethakka | వలసనలు అరికట్టేందుకు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కూలీలకు వరమన్నారు. గ్రామీణులు వలసలు పోవడాన్ని నివారించేందుకు కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు ఫొటో క్యాప్చర్ చేయాల్సి వస్తుండడం, సర్వర్​ పనిచేయక ఆలస్యమవుతోందన్నారు. ఎండాకాలం ఉపాధి హామీ కూలీలు ఉదయమే పనులు చేయాలని.. వారికి టెంట్, తాగునీరు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీలు ఉపాధిహామీ కూలీలు మట్టి తవ్వే ప్రాంతాన్ని నీటితో తడిపితే మరుసటిరోజు మట్టి తీయడం సులభమవుతుందన్నారు.

Minister Seethakka | మహిళా సంఘాల ద్వారా..

మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) నిర్మించుకునేందుకు రూ.లక్ష రుణం అందజేస్తామని, ఒకవేళ మహిళా సంఘం సభ్యురాలు మృతి చెందితే రూ.10 లక్షల జీవిత బీమా ద్వారా అందజేస్తామని మంత్రి వివరించారు. మహిళ సంఘాలకు రూ.60వేల కోట్లు అందజేశామన్నారు. విద్యుత్ 200 యూనిట్లు వరకు ఉచితం, సన్నబియ్యం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గ్రామంలో రోడ్డు వేయడానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు స్కూల్​పై కప్పు కూలిపోయినందున ఎస్టిమేషన్ ప్రతిపాదనలు పంపాలన్నారు. మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు మంజుల సాయాగౌడ్ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ గౌడ్​లతో గృహప్రవేశం చేశారు. సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: KTR Farmer Assurance | రైతులకు రేవంత్ ఇచ్చేది ‘వాయిదాల’ భరోసానేనా..?: కేటీఆర్

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *