జాతీయంPawan Khera Bail | కాంగ్రెస్​ నాయకుడు పవన్​ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన...

Pawan Khera Bail | కాంగ్రెస్​ నాయకుడు పవన్​ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Khera Bail | కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆరోపణలు, ఎఫ్ఐఆర్ రెండూ రాజకీయ వైరం కారణంగానే తలెత్తినట్లు కనిపిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

పవన్​ ఖేరా గతంలో ఓ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్య రినికి భూయాన్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Pawan Khera Bail | సహకరించాలని ఆదేశం

బెయిలు మంజూరు చేస్తూ ఈ కేసు దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోర్టు ఖేరాను ఆదేశించింది. అస్సాం ముఖ్యమంత్రి భార్యపై కాంగ్రెస్ నాయకుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో గౌహతిలో ఈ కేసు నమోదైంది. పరువు నష్టం, ఫోర్జరీ వంటి అభియోగాలకు ఇది దారితీసింది. ఈ కేసులో మొదట పవన్​ ఖేరా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బెయిల్​ పిటిషన్​ వేశారు. అక్కడ ఊరట లభించగా.. అస్సాం పోలీసులు (Assam Police) సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు నమోదు అయిన గౌహతి కోర్టులో బెయిల్​ పిటిషన్​ వేయాలని ఖేరాకు సూచించింది. అయితే గౌహతి కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా ధర్మాసనం పవన్​ ఖేరాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి..: Parag Agrawal AI Startup | ట్విట్టర్ నుంచి బయటకు.. ఏఐ లో రారాజుగా.. పరాగ్ అగర్వాల్ సరికొత్త సంచలనం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chandrababu Pension Scheme | ఏడాదికి రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే :సీఎం చంద్రబాబు

అక్షరటుడే, కృష్ణా జిల్లా: Chandrababu Pension Scheme | ఆంధ్రప్రదేశ్ (Andhra...

Mumbai Cocaine Seizure | ముంబైలో ఎన్సీబీ సంచలనం.. రూ.1,745 కోట్ల కొకైన్ సీజ్!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Mumbai Cocaine Seizure | దేశ ఆర్థిక రాజధాని...

Air India Services Cut | ఎయిరిండియా కీలక నిర్ణయం.. పలు మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India Services Cut | పశ్చిమాసియాలో నెలకొన్న...

Attack on Trump | ట్రంప్‌పై దాడికి యత్నం.. షాకింగ్ వీడియో విడుదల, బయటపడిన నిందితుడి ప్లాన్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack on Trump | అమెరికాలో మరోసారి భద్రతా...