అక్షరటుడే, వెబ్డెస్క్: Mumbai Fire Accident | ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫర్నిచర్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల తీవ్రతతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Mumbai Fire Accident | తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక దళం..
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఆరు ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Maruti Automatic S-CNG | మారుతి సుజుకి నుంచి సరికొత్త ఆటోమేటిక్ ఎస్-సిఎన్‌జి కార్లు విడుదల..
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం, ప్రమాదానికి గల కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.