అక్షరటుడే వెబ్‌డెస్క్: Amazon Great Indian Festival | దేశవ్యాప్తంగా పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా (Amazon.in) కీలక ప్రకటన చేసింది. ప్రతిష్టాత్మకమైన ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ఈ ఏడాది అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఈ పండుగ సేల్‌లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అప్లయెన్సెస్, కిరాణా సామాగ్రి సహా అన్ని ప్రముఖ కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు, సంవత్సరంలోనే అత్యల్ప ధరలను ఆశించవచ్చు.
Amazon Great Indian Festival | ప్రత్యేక ఆఫర్లు..
ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులు ఎస్‌బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులు అలాగే ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా మరో 10 శాతం వరకు అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రైమ్ వీడియోలో ప్రత్యేకమైన ఒరిజినల్ కంటెంట్‌ను వీక్షించే అవకాశంతో పాటు, వినియోగదారులు మరింత సులభంగా షాపింగ్ చేయడానికి ప్రొడక్ట్స్‌ను పోల్చడం, ధరల హిస్టరీని చెక్ చేయడం వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) షాపింగ్ ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
Amazon Great Indian Festival | లక్షలాది ఉద్యోగాలు..
ఈ పండుగ సీజన్ డిమాండ్‌ను తట్టుకునేందుకు అమెజాన్ ఇండియా తన ఆపరేషన్స్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా భారీగా విస్తరించింది. ఇందులో భాగంగా 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 సార్ట్ సెంటర్లు, 150 కొత్త డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ సీజన్ కోసం ఏకంగా 1,60,000 కంటే ఎక్కువ తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లోనూ ఈ సేవలు విస్తరించాయి.
Amazon Great Indian Festival | నిమిషాల్లోనే డెలివరీల కోసం ‘అమెజాన్ నౌ’..
నిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలు, తాజా పండ్లు, కూరగాయలు అందించే ‘అమెజాన్ నౌ’ సేవలు ప్రస్తుతం 60కి పైగా నగరాల్లో అందుబాటులో ఉండగా.. దీపావళి నాటికి మరో 100 నగరాలకు విస్తరించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వేలకొద్దీ ఉత్పత్తులు నిమిషాలు లేదా గంటల్లోనే డెలివరీ కానున్నాయి. ఈ పండుగ సేల్‌కు సంబంధించిన పూర్తి డీల్స్ కోసం అమెజాన్ యాప్‌లోని స్టోర్‌ఫ్రంట్‌ను సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: Tirumala Brahmotsavam | స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు