అక్షరటుడే వెబ్‌డెస్క్: Koneti Sulochana Arrest | ఒకప్పుడు సాధారణ కూలీగా పని చేసిన కోనేటి సులోచన, రాజకీయ నాయకులు , అధికారుల అండతో వందల కోట్ల రూపాయల భూములను అక్రమంగా ఆక్రమించింది. ‘లేడీ డాన్’గా పేరు తెచ్చుకున్న ఈమెను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ( Madanapalle )అమాయకులను మోసం చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాను నడిపిస్తున్న ఆమెపై ఇప్పటికే 14 చీటింగ్, భూ కబ్జాలు, హత్యాప్రయత్నం కేసులు ఉండగా రౌడీషీట్ కూడా నమోదై ఉంది. జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్‌ల ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీసులు ఈ సంచలన అరెస్ట్ చేశారు.
Koneti Sulochana Arrest | రియల్ ఎస్టేట్ డాన్‌గా..
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన సులోచన ఒకప్పుడు సాధారణ వ్యవసాయ కూలీగా జీవితాన్ని ప్రారంభించింది. అయితే కొంతకాలంగా అక్రమ మార్గాలను ఆశ్రయించి, పలువురు రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అపారమైన ఆస్తులను కూడబెట్టింది.
Koneti Sulochana Arrest | బయటపడ్డ భారీ అక్రమాలు..
ప్రైవేట్ వ్యక్తులకు అత్యవసరంగా అప్పులు ఇస్తామని నమ్మించి వారి విలువైన ఆస్తులను కాజేయడం, నకిలీ పవర్ ఆఫ్ అటార్నీ (POA) ద్వారా వందల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేయడం ఈమె ప్రధాన నేర శైలిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో గతంలో కోర్టు సెర్చ్ వారెంట్‌తో పోలీసులు ఆమె నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 50 నుంచి 60 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 50కి పైగా ఆస్తి పత్రాలు, సంతకాలు ఫోర్జరీ చేసిన 15 ఖాళీ బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో లేక అదుపులో ఉన్న ఆమెను విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mission Bhagiratha Water Supply | మారుమూల గిరిజన పల్లెలకూ మిషన్ భగీరథ జలాలు