Mission Bhagiratha Water Supply | మారుమూల గిరిజన పల్లెలకూ మిషన్ భగీరథ జలాలు

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mission Bhagiratha Water Supply | మాముమూల గిరిజన ప్రాంతాలకు సైతం మిషన్ భగిరథ ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. మోపాల్ మండలం అమ్రాబాద్ తండాను కలెక్టర్ గురువారం సందర్శించారు.

Mission Bhagiratha Water Supply | మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో..

మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో పలు తండాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఇదివరకు అమ్రాబాద్ తండా సహా సుమారు 11 నివాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాలకు మిషన్ భగీరథ జలాలు అందించేందుకు వీలుగా అనువైన పరిస్థితులను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో సందర్శించామన్నారు. తాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తిగా బోరుబావుల పైనే ఆధారపడి జీవనాలు వెళ్ళదీస్తున్నామని.. స్థానిక గిరిజనులు తమ దృష్టికి తెచ్చారన్నారు.

Mission Bhagiratha Water Supply | ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని నివాస ప్రాంతాలకు రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా అనుకూలమైన ప్రదేశంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చి జల్ జీవన్ మిషన్ కింద కవర్ అయ్యేలా చూడాలన్నారు. కాగా, ఎల్ నినో ప్రభావం వల్ల ఆశించిన రీతిలో వర్షాలు కురియక నీటి నిల్వలు అంతంతమాత్రంగానే అందుబాటులో ఉన్నాయని, భూగర్భ జలమట్టం సైతం దిగువకు పడిపోయినందున ప్రస్తుతం ఆరుతడి పంటలే సాగు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పప్పుదినుసులు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలను సాగు చేయాలన్నారు. ఆర్డీవో రాజేంద్రకుమార్, మిషన్ భగీరథ ఈఈ రాకేష్, మోపాల్ తహశీల్దార్ రేఖ, సర్పంచ్ ప్రియాంక తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Public School | ఎట్టకేలకు పబ్లిక్ స్కూల్ కల సాకారం : ఎమ్మెల్యే ధన్ పాల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *