Telangana Public School | ఎట్టకేలకు పబ్లిక్ స్కూల్ కల సాకారం : ఎమ్మెల్యే ధన్ పాల్

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం తాను ప్రతిపాదన పంపడంతో ప్రభుత్వం మంజూరు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఇందూరు: Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం కోసం తాను ప్రతిపాదన పంపడంతో ప్రభుత్వం మంజూరు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి గురువారం నగరంలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు.

Telangana Public School | రెండు స్కూళ్లు..

ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పబ్లిక్ స్కూల్ లను ఎంపిక చేశారన్నారు. ఇందులో భాగంగా అర్బన్ నియోజకవర్గంకు సంబంధించి నగరంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారని తెలిపారు. తాను గతంలో అనేకసార్లు పాఠశాలను పరిశీలించి,  ఇక్కడి పరిస్థితిని చూసి పబ్లిక్ స్కూల్ కోసం ప్రతిపాదన పంపించానని ఎప్పారు. సుమారు 2 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అయితే నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇప్పటికే ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్ వే కూడా రాబోతుందన్నారు. అలాగే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన విధంగా డివిజన్ కు రూ.20 లక్షల పనులు ప్రారంభమవుతున్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు ప్రసన్న శ్యామల సత్యపాల్, నాగోల్ల లక్ష్మీనారాయణ, చింతకాయల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Knife Attack | వ్యక్తిగత కక్షలతో కత్తి దాడి.. యువకుడికి గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *