అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nitin Nabin | ఇందూరుకు ఈనెల23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారు. నగరంలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్ నితిన్ నబీన్ పర్యటనను ధృవీకరించారు.
Nitin Nabin | జూమ్‌లో జిల్లా బీజేపీ నాయకులతో మీటింగ్..
జాతీయ అధ్యక్షుడి పర్యటనను పురస్కరించుకుని కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నాయకులతో ఎంపీ జూమ్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పాదయాత్ర నిర్వహణ, సభా ప్రాంగణం ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, జన సమీకరణ తదితర అంశాలపై నాయకులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వివిధ స్థాయిల్లో నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గాంధీ చౌక్ నుంచి ఆర్‌ఆర్ చౌరస్తా వరకు ఈ పాదయాత్ర కొనసాగనుండగా, అనంతరం ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నితిన్ నబీన్ ప్రసంగించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇది కూడా చదవండి..: Fake 50 notes Nizamabad | నిజామాబాద్ గంజ్ కూరగాయల మార్కెట్లో దొంగ నోట్ల కలకలం!