Rekha Naik ED Raids | మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్​ ఇళ్లలో ఈడీ సోదాలు

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rekha Naik ED Raids | ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఉదయం రెండు చోట్ల తనిఖీలు చేశారు.

రేఖానాయక్​కు రైస్​ మిల్లులు ఉన్నాయి. అయితే వాటిలో సీఎంఆర్​ బియ్యం పక్కదారి పట్టినట్లు గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తాజాగా ఈడీ, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సోదాలు చేశారు. సత్తెనపల్లి (Sattenapalli)లోని రేఖా నాయక్‌కు చెందిన ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం అయింది. రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈడీ సోదాలు చేపట్టాయి. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గతంలోనే పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. గతంలోనే రేఖా నాయక్‌పై బీఎన్​ఎస్​ సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Rekha Naik ED Raids | భారీగా బలగాలు

ఇంట్లో రేఖా నాయక్‌తో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇంటి సమీపానికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. ఇంటి చుట్టూ సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.

ఇది కూడా చదవండి..: Telangana Cold Wave | భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *