అక్షరటుడే, ఎల్లారెడ్డి: Silver Anklets Returned | తన కారులో గుర్తు తెలియని వ్యక్తులు మరిచిపోయిన వెండి కడియాలు తిరిగిచ్చేందుకు ఓ సర్పంచ్ సిద్ధమయ్యాడు. మానవత్వమే మనిషికి నిజమైన ఆభరణమని చాటుతున్నాడు వెలుట్లపేట (Velutlapet) సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్.
Silver Anklets Returned | కారులో మర్చిపోవడంతో..
తన కారులో ప్రయాణించే సమయంలో మానవతా దృక్పథంతో పలువురికి లిఫ్ట్ ఇస్తుంటానని, ఈ క్రమంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 50 తులాల కాళ్ల వెండి కడియాలను కారులో మర్చిపోయి వెళ్లినట్లు సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ తెలిపారు. అయితే ఆ ఆభరణాలు ఎవరివి..? ఎక్కడి వారు..? ఎప్పుడు కారులో మర్చిపోయారు..? అనే వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. విలువైన ఆభరణాలను వాటి అసలైన యజమానులకు తిరిగి అప్పగించాలనే ఉద్దేశంతో ఈ సమాచారం వెల్లడించారు.
Silver Anklets Returned | గుర్తింపు కార్డుతో వస్తే..
సంబంధిత వ్యక్తులు తగిన గుర్తింపు వివరాలు, ఆధారాలు చూపించి తనను సంప్రదించాలని కోరారు. ఆభరణాల యజమానులు 99494 21727 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమాచారం నిజమైన యజమానులకు చేరేలా ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Nitin Nabin | 23న ఇందూరుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్