అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Employee Issues | ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లాఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్యే బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిశారు.
Employee Issues | సెక్రటేరియట్ అధికారులతో మాట్లాడతా..
ఉద్యోగుల పలు సమస్యలపై ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్ ప్రతినిధులు కలువగా మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. తాను సమస్యల పరిష్కారినికి సెక్రటేరియట్ అధికారులతో మాట్లాడుతానన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పీసీసీ చీఫ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, ఏవో వినయ్ కుమార్, టీఐఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడారి జనార్ధన్, సామ్యూల్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Journalist Training | జర్నలిస్టు వృత్తి బాధ్యతతో కూడుకున్నది..: ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి