Cyclone Aqwan | అక్వాన్ తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. గంటకు 21 కి.మీ. వేగంతో కదలిక..

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Cyclone Aqwan | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా తీరాలను తుపాన్ బాహ్యవలయం తాకగా, గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటుతున్నట్లు వాతావరణ శాఖ , రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని గంటల సమయం పట్టనుంది.

Cyclone Aqwan | తుపాన్ ప్రస్తుత గమనం..

గత ఆరు గంటలుగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాన్.. కళింగపట్నానికి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 170 కిలోమీటర్లు, పూరీకి 250 కిలోమీటర్లు, నరసాపురానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాన్ ప్రభావంతో నేడు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Cyclone Aqwan | శ్రీకాకుళం జిల్లాలో కుండపోత..

తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కంచిలి, కవిటి మండలాల్లో 10 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Cyclone Aqwan | అధికారుల హెచ్చరిక..

తుపాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:  Silver Anklets Returned | మానవత్వం చాటుకున్న సర్పంచ్.. 50 తులాల వెండి కడియాలు తిరిగిచ్చేందుకు సిద్ధం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *