అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad ORR Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోకాపేట సమీంలో లారీని ఎలక్ట్రిక్ కారు ఢీకొంది.
ఈ ప్రమాదం అనంతరం ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. అనంతరం వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో కారులో నలుగురు ఉన్నారు. ఢీకొట్టిన కొద్ది నిమిషాలకే కారుకు మంటలు అంటుకున్నాయి, కానీ అందులోని నలుగురు ప్రయాణికులు సకాలంలో మంటలను గమనించి, కిందకు దిగి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతరం కారు పూర్తిగా కాలిపోయింది. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు.
Hyderabad ORR Accident | ట్రక్కు బోల్తా
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ఆపిల్ పండ్లతో వెళ్తున్న ఒక ట్రక్కు బోల్తా పడింది. శుక్రవారం ఉదయం వేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Adibatla TCS Ayyappa row | ఆదిభట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప దీక్షా వస్త్రధారణ వివాదం.. గేటు ఎదుట భక్తుల నిరసనతో ఉద్రిక్తత!