Devanpally Granite Quarries | క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి.. ప్రజావాణిలో దేవన్‌పల్లి గ్రామస్తుల ఫిర్యాదు

భీమ్​గల్​ మండలంలోని దేవన్‌పల్లి గ్రామ పరిధిలో కొనసాగుతున్న గ్రానైట్ క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Devanpally Granite Quarries | మండలంలోని దేవన్‌పల్లి గ్రామ పరిధిలో కొనసాగుతున్న గ్రానైట్ క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్​గల్(Bheemgal) టాకీస్ నుంచి క్వారీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజావాణి వరకు ర్యాలీ నిర్వహించి, అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Devanpally Granite Quarries | పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి..

డిజైనర్ రాక్, జంబో రాక్ పేర్లతో చేపడుతున్న భారీ తవ్వకాల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని గ్రామస్తులు ఆరోపించారు. క్వారీ గుంతల్లో నిలిచిన నీటిని మోటార్లతో తోడి కాలువల్లోకి వదులుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, తాగు, సాగునీటి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదముందన్నారు. దుమ్ము, ధూళితో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, భారీ పేలుళ్లతో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని వాపోయారు. భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ రహదారులు సైతం దెబ్బతింటున్నాయన్నారు.

Devanpally Granite Quarries | సమగ్ర విచారణ జరిపించాలి..

క్వారీల అనుమతులు, పేలుళ్ల నిర్వహణ, భూగర్భ జలాల వినియోగంపై సంబంధిత శాఖల అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు స్పందించి క్వారీలను మూసివేయకపోతే దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

89080

ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులకు..ఇలాంటివి నిత్యం అవసరం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *