అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Sri Krishna Foundation | సమాజసేవే లక్ష్యంగా ఏర్పాటైన శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బాసటగా నిలుస్తోంది. జిల్లా (Nizamabad) వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
Sri Krishna Foundation | గ్రీన్ బోర్డుల విరాళం..
ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకుల కొండూరు ప్రాథమిక పాఠశాలకురూ. రూ.10వేల విలువైన నాలుగు గ్రీన్ బోర్డులను అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తరగతి గదుల్లో డస్ట్-లెస్ (Dustless) బోర్డులు ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ వీటిని పాఠశాలకు అందించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను గుర్తించి వారికి తమ వంతు సాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: NHM employees strike | సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినతి