NHM employees strike | సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినతి

ఈ సందర్భంగా 32 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.

Naresh Chandan

అక్షర టుడే, కామారెడ్డి: NHM employees strike | తమ దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 32 రోజులపాటు చేపట్టిన నిరవధిక సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తక్షణమే విడుదల చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు కోరారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు.

NHM employees strike | తాత్కాలిక సమ్మె విరమణ పత్రం అందజేత

రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం జేఏసీ (JAC) పిలుపు మేరకు సోమవారం కామారెడ్డి KAmareddy జిల్లా కేంద్రంలో ఉద్యోగులు డీఎంహెచ్‌ఓను కలిసి తాత్కాలిక సమ్మె విరమణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా 32 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను మంజూరు చేయాలని కోరారు.

NHM employees strike | డీఎంహెచ్‌ఓకు సన్మానం

ఈ సందర్భంగా జిల్లా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తాము 32 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించినట్లు గుర్తుచేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

భవిష్యత్తులోనూ జిల్లాలోని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, పెండింగ్ వేతనాలు త్వరగా అందేలా కృషి చేయాలని జేఏసీ నాయకులు అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాక్టర్ మారుతి, డాక్టర్ హరీష్, పద్మజ, వెంకట రమణ, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ మౌనిక, అశ్విని, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *