Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్​

బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు. టీఎన్జీవోస్​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో నగరంలోని పాత కలెక్టరేట్​ వద్ద నవదుర్గా ఆలయంలో బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తారు.

Bonalu Festival | ఆలయంలో ప్రత్యేక పూజలు..

ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణతో కలిసి ఆయన బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు మహేష్​ కుమార్​ గౌడ్​, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal), మేయర్​ ఉమారాణి, మాజీ మేయర్​ సంజయ్​ తదితరులను ఘనంగా సన్మానించారు.

Bonalu Festival

కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​, టీఎన్జీవోస్​ నిజామాబాద్​ అధ్యక్షుడు సుమన్​కుమార్​, కార్యదర్శియ నేతికుంట శేఖర్​, ప్రతినిధులు పెద్దోళ్ల గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్జీవోస్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *