CJP Movement | సీజేపీని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదు: అభిజీత్ దీప్కే

దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదని దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CJP Movement | దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదని దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన వ్యూహాత్మక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ఒక బలమైన ‘ప్రెజర్ గ్రూప్‌’గానే సీజేపీ ఎప్పటికీ కొనసాగుతుందని ప్రకటించారు.

CJP Movement | యువతకు పూర్తి మద్దతు..

దేశంలో ఎక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టినా తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని అభిజిత్ దీప్కే హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. శాంతియుత నిరసనలు తెలిపే యువతపై బలప్రయోగం చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, ప్రభుత్వాలు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని  ఆయన హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *